రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట: సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ, వేతనం చెల్లింపు

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించింది. ఆయన ఉద్యోగ సర్వీసు కాలానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కాలాన్ని, చంద్రబాబు సర్కారు క్రమబద్ధీకరించింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు మొదటిసారిగా సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై, 2022 జూన్ నుంచి 2024 మే వరకు మరొకసారి సస్పెన్షన్ విధించబడింది. అయితే, తాజాగా ఈ సస్పెన్షన్ కాలాన్ని […]