సూపర్ కూల్ సాంగ్ మీను లిరికల్ వీడియో టాక్ ఆఫ్ ది టౌన్

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మీను సాంగ్ ప్రోమోకి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ పాట యొక్క పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ గీతాన్ని భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య పాడారు. మీనాక్షి చౌదరి వెంకటేశ్‌ను ఫాలో అవుతూ సాగే ఈ పాట, మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.