లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్లపై టీడీపీ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఈ అంశంపై అత్యుత్సాహం వద్దని, ఎవ్వరూ బహిరంగ ప్రకటనలు చేయొద్దని పార్టీ నేతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతలకు హైకమాండ్ వార్నింగ్టీడీపీ అధిష్టానం పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఏ అంశమైనా కూటమి నేతలు కలిసి చర్చించాకే నిర్ణయం తీసుకుంటారని, వ్యక్తిగత అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించరాదని తేల్చి చెప్పింది. […]