తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేడు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, కొలికపూడి పార్టీ నియమాలు అతిక్రమిస్తున్నారని, ఆయన వ్యవహార శైలి సరిగా లేదని కమిటీ స్పష్టంగా తెలిపిందన్నారు. గత ఏడు నెలల్లో రెండు సార్లు కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, త్వరలోనే ఆయనపై నివేదిక సమర్పించనున్నట్లు […]