మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేసింది. వేములవాడ, కీసర, శ్రీశైలం, ఏడుపాయల, పాలకుర్తి వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. […]