వచ్చేస్తున్న రానా నాయుడు2,,అసభ్యతా లేకుండా టీజర్ రిలీజ్..!

దీంతో పార్ట్ 1 లో జరిగిన మెస్టేక్స్ ను రిపీట్ కాకుండా చర్యలు తీసుకున్నట్లు విక్ట‌రీ హీరో చెప్పుకొచ్చాడు.. అంతేకాక బూతులు కూడా తగ్గించినట్లు వివ‌రించాడు. సీజన్‌ 2 ఎక్కువ మందికి రీచ్ అవుతుంద‌ని… తప్పకుండా అందరినీ మెప్పించే కంటెంట్ తో వస్తున్నట్లు చెప్పి హైప్ ను క్రియేట్ చేశాడు. నిజానికి ఫస్ట్ పార్ట్ కు వచ్చిన విమర్శల కారణంగానో ఏమో.. ఈ టీజర్ లో ఎలాంటి అసభ్యతా లేకుండా చూసుకున్నారు. మరి టీజర్ వరకేనా.. సిరీస్ కూడా క్లీన్ గానే ఉంటుందా అనేది చూడాలి.

వెర్సటైల్ యాక్టర్ , ఫ్యామిలీ హీరో , అన్నీ క్యారెక్టర్స్ లో అన్ని రకాల వేరియేషన్స్ చూపించ గల ఏకైక హీరో ఎవరైన ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు .. ఇక వెంకీ చేసిన పోలీస్ పోలీస్ క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు . విక్ట‌రీ వెంక‌టేష్.. ఫ్యామిలీ మూవీల‌కు కేరాఫ్ అడ్ర‌స్. అలాంటిది ఆ మ‌ధ్య‌లో రానా నాయుడు అంటూ ఓ ప్ర‌యోగం చేసి అభిమానుల‌కు, ఆడియెన్స్‌కు అంద‌రికీ షాకిచ్చాడు. వెంకటేష్ కెరీర్ […]