బెల్టులో బంగారు నాణాలు దాచుకుని దేశానికి తీసుకొచ్చిన ప్రయాణికులు అదుపులో

ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు మిలాన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి పది కిలోల బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన తనిఖీలలో స్మగ్గింగ్ దందా బయటపడింది. ఇటలీలోని మిలాన్ నుంచి వచ్చిన ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిన నేపథ్యంలో, కస్టమ్స్ అధికారులు వారిపై ప్రత్యేకంగా తనిఖీ చేపట్టారు. లగేజీ క్షుణ్ణంగా సోదా చేసినప్పటికీ, ఏమీ బయటపడలేదు. కానీ మరోసారి చేసిన తనిఖీ లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్టులు బయటపడినాయి. […]