బీజీపీ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని, రాష్ట్రాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌లో తెలంగాణకు ఏదైనా కేటాయింపులు చేయడంలో కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరించిందని అన్నారు. “తెలుగు కోడలు అయిన నిర్మలా సీతారామన్ తెలంగాణపై కనీసం అభిమానం చూపించలేకపోయారు” అని గౌడ్ విమర్శించారు. ఆయన ప్రకారం, నిర్మలాతో పాటు ఇతర బీజేపీ నాయకులు కూడా తెలంగాణ విషయాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్రమంత్రి నిర్మలా […]