ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ మూడో మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ అధికారం సాధించడానికి అన్ని కట్టుదిట్ట చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే రెండు మేనిఫెస్టోలతో ఎన్నికల బాటలో దూసుకుపోతున్న బీజేపీ తాజాగా తన మూడో మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. “సంకల్ప్ పత్ర-3” పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో, బీజేపీ ఢిల్లీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక హామీలు ఇచ్చింది. […]