చిరంజీవితో అనిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ..2027 పొంగల్ కు కానున్న రిలీజ్..!

చిరంజీవి అనిల్ కాంబోలో రాబోతున్న మూవీ… పూర్తి వినోదాత్మకంగా ఉండనుందట. వేసవిలో సినిమాను మొదలు పెట్టి సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. సంక్రాంతికి వస్తున్నాం మూవీని కేవలం 72 రోజుల్లోనే తెరకెక్కించిన అనిల్…. చిరు మూవీపై కూడా అలాంటి ఫోకస్ పెట్టబోతున్నాడట. అంతేకాక చిరు మూవీ కంప్లీట్ అయిన తర్వాత మరోసారి వెంకటేష్ ను మూవీ చేయనున్నాడట. వెంకీ అనిల్ మూవీ కూడా సంకాంత్రికే విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట.

ఫెస్టివల్ హిట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాడు ఆ యంగ్ డైరెక్టర్. కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లకముందే… ఏదో పండగకు ముందే కర్చీఫ్ వేసుకుంటున్నాడు. ఎప్పటిలానే పండగకు ఫిక్స చేసుకోవడమే కాదు… క్రేజీ ప్రాజెక్టును లైన్ లో పెట్టేస్తున్నాడు. యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దూకుడు మాములుగా లేదు. వ‌రుస‌గా హిట్లు కొట్ట‌డ‌మే కాదు.. అందులోనూ పండ‌గ‌ల‌నే టార్గెట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. భగవంత్ కేసరీ తో దసరాను టార్గెట్ చేసి… హిట్ కొట్టేశాడు. […]