నందమూరి మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగుతున్న నాగ్ అశ్విన్ ..

నందమూరి మోక్షజ్ఞ్య కూడా ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ్య ఒక ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కాకుండా, మోక్షజ్ఞ్య కోసం మరో సెన్సేషనల్ కాంబినేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. “కల్కి 2898 ఎడి” సినిమా ద్వారా 1000 కోట్ల వసూళ్లు సాధించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ్య సినిమా చేస్తారన్న రూమర్స్ విస్తరించాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్నట్టు కూడా సమాచారం.. అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.