దేవర-2’ కోసం కొరటాల శివ కొత్త ప్రయాణం ప్రారంభం

NTR 31 కోసం ప్రశాంత్ నీల్ కొత్తగా యూరప్ లోని నల్ల సముద్రం ప్రాంతంలో కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమా విజువల్‌గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం కోసం ప్రత్యేకంగా లొకేషన్స్‌ను ఎంచుకున్నారు.. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే NTR 31 సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ పీరియడ్ సినిమా తారక్ అభిమానులకు ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని అంతా భావిస్తున్నారు.

ఈ విజయవంతమైన సినిమాకు సీక్వెల్ చేయడానికి దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే పనులు జరుపుకుంటున్నాయి. కథలో కీలక సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మలచేందుకు దర్శకుడు తన టీమ్‌తో శ్రద్ధతో పని చేస్తున్నారని సమాచారం.వచ్చే ఏడాది నుంచి ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.