దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు: భార్య తేజస్విని స్పందించారు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఈ రోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. సినిమా నిర్మాణాలకు సంబంధించిన తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. సోదాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు వివ‌రాలు: తేజస్విని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, రికార్డులను వారికి అందజేసాం. అలాగే, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చాం. […]