తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు!

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించిన విధానం బాధ్యతాయుతంగా ఉంది. ఆయన మాట్లాడుతూ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఘటనకు సంబంధించిన ఆవేదనను వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇవ్వడం మంచి చర్య. ఈ దురదృష్టకర ఘటనను భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడటం ముఖ్యం. […]