తిరుమల స్వామివారి సేవలో నటి జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం నాడు, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకి చేరుకుని, ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికారు మరియు ఆమె కోసం ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం, రంగనాయకుల మండపంలో పండితులు జాన్వీకి వేదాశీర్వచనం పలికారు. అనంతరం, స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. జాన్వీ కపూర్ ఇంతకుముందు కూడా పలు సందర్బాల్లో తిరుమల […]