తిరుమల శ్రీవారి పరకామణి నుంచి బంగారం చోరీ చేసిన బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి అరెస్ట్

తిరుమల శ్రీవారి పరకామణి నుండి బంగారం చోరీ చేసిన బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 100 గ్రాముల బంగారు బిస్కట్ చోరీ చేసిన విషయం గత కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజాగా విచారణలో పెంచలయ్య మరో షాకింగ్ విషయం వెల్లడించాడు. పెంచలయ్య గతంలో కూడా తిరుమల శ్రీవారి పరకామణి నుంచి బంగారం చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడితో విచారణ కొనసాగించగా, మరో 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి, […]