‘డాకు మహారాజ్’ ట్రైలర్ లో ‘సమర సింహారెడ్డి’ తరహా సీక్వెన్స్!

“గత 20-30 ఏళ్ళలో బాలకృష్ణ గారిని చూడనంత కొత్తగా ఈ సినిమాలో చూడబోతున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ‘డాకు మహారాజ్’ బాలకృష్ణ గారి కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న సినిమా విడుదల చేయబోతున్నాం. భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం.”

ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింత పెంచిన వార్త నిర్మాత నాగవంశీ ఇచ్చారు. ఆయన తన సోషల్ మీడియా పేజీలో ‘డాకు మహారాజ్’ సెకండాఫ్ లో ఒక ప్రత్యేక సీక్వెన్స్ ఉంటుందని, అది ‘సమర సింహారెడ్డి’ తరహా ఎపిసోడ్ గా ఉంటుందని ప్రకటించారు. ఇది అభిమానులను తిరిగి పాత రోజులకు తీసుకెళ్లనుంది అని నాగవంశీ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ ద్వారా, సమర సింహారెడ్డి మూవీలోని పవర్‌ఫుల్ డైలాగ్స్, బాలయ్య ఊచకోత తరహా సీక్వెన్స్ ‘డాకు మహారాజ్’ లో కూడా ఉంటుందని అర్థమవుతోంది. దీంతో, ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.