టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ పై ఉద్యోగుల నిరసన

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ పై దేవస్థానం ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నరేశ్ కుమార్, శ్రీవారి దర్శనం అనంతరం బయటికివస్తున్నప్పుడు, ఒక టీటీడీ ఉద్యోగి గేటు తీయకుండా అడ్డుకున్నాడంటూ, ఆయన తీవ్ర పదజాలంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో టీటీడీ ఉద్యోగులు దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నరేశ్ కుమార్ వైఖరిని తప్పుపడిన టీటీడీ ఉద్యోగులు, ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. […]