కోడిపందేలు నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు

హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలంలోని ఒక ఫాంహౌస్‌లో కోడిపందేల నిర్వహణకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించిన పోలీసులు, కోడిపందేల నిర్వహణపై ఆయన వివరణ కోరారు. ఈ వ్యవహారం పై అధికారికంగా వివరాలిచ్చిన ఆయన, ఈ ఫాంహౌస్‌ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో, ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు నోటీసులో […]