కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు: అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యల వివరణ కోరిన పీసీసీ

కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 4న వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఆయన అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నపులు చేసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాహుల్‌దేవ్ ఈ మేరకు వివరించారు. ఈ అంశంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లన్న చేసిన […]