కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ఏపీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వస్తే, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి సౌకర్యం కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో పర్యటిస్తోంది. ఈ ఉపసంఘం సభ్యులైన రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి అనిత, మహిళా శిశు సంక్షేమ […]