ఏపీ వెయిట్ లిఫ్టర్లు 38వ జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్నారు

38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ రోజు మహిళల 71 కిలోల విభాగంలో విజయనగరం జిల్లా యువతి ఎస్. పల్లవి స్వర్ణ పతకాన్ని గెలిచారు. కాగా, నిన్న పురుషుల 67 కిలోల విభాగంలో కూడా ఏపీకి చెందిన కె. నీలం రాజు స్వర్ణ పతకాన్ని సాధించి, రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చారు. ఈ విజయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. “కంగ్రాచ్యులేషన్స్ పల్లవి… విజయనగరం నుంచి వచ్చిన మన రాష్ట్ర పుత్రిక […]