తెలంగాణ మంత్రివర్గం సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు ఆమోదం

తెలంగాణ మంత్రివర్గం, సమగ్ర కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ నివేదికలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అసెంబ్లీ హాలులో సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ నిర్ణయంతో, ఈ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం కులగణన నిర్వహించి చరిత్ర సృష్టించింది” అని తెలిపారు. “పకడ్బందీగా సర్వే నిర్వహించి సమాచారం సేకరించడం […]