ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితిని మరోసారి పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనాన్ని చేపట్టిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఉన్న ఈ కమిషన్, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై పరిశీలన చేసి, సిఫార్సులు ఇవ్వాలని పని చేస్తున్నది. గత ఏడాది నవంబర్ 11న కమిషన్ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ షమీమ్ అక్తర్, వర్గీకరణపై సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేసి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, జనవరి 10న […]