వైల్డ్ లుక్‌లో ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ..!
NTR 31 కోసం ప్రశాంత్ నీల్ కొత్తగా యూరప్ లోని నల్ల సముద్రం ప్రాంతంలో కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమా విజువల్‌గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం కోసం ప్రత్యేకంగా లొకేషన్స్‌ను ఎంచుకున్నారు.. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే NTR 31 సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ పీరియడ్ సినిమా తారక్ అభిమానులకు ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని అంతా భావిస్తున్నారు.