ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ పరేడ్ ఘనంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వేడుకలు మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు, ప్రముఖ వ్యక్తిత్వాలు, పోలీసు శాఖ బృందం తదితరులు పాల్గొన్నారు. పరేడ్ సందర్భంగా, ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ద్వారకా తిరుమలరావు, “ఇవి నా జీవితంలో ఉద్విగ్నభరిత క్షణాలు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే చాలా భావోద్వేగంగా ఉంది. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక […]