అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్: ఆరోగ్య పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 85 సంవత్సరాల వయసున్న ఆయన, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఇటీవల లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. షుగర్, బీపీ వంటి అనారోగ్యాలతో కొన్నాళ్లుగా బాధపడుతున్న సత్యేంద్ర దాస్, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యేంద్ర దాస్ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తాత్కాలిక రామ మందిరంలో పూజారి గాను వ్యవహరించారు. ఆ తరువాత, ఆయన అయోధ్య రామ మందిరం […]