ఇండస్ట్రీలో అనిరుధ్ దూకుడు ,, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ ..!

అఖండ 2' తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో జతకట్టనున్నాడు. 2023లో వీరసింహ రెడ్డి సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ కి డెఫినేషన్ అయినా బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ అయితే మరింతా బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దాదాపుగా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ చేయనున్న ఓ నెక్ట్స్ ప్రాజెక్టులో అను ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. త్రివిక్రమ్, సందీప్ వంగాలతో బన్నీ మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీల్లో ఒకదానికి అనిరుథ్ మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

గెస్ట్ గా వచ్చాడు. అలాగే వెళ్లిపోతాడేమోలే అనుకున్నారు కానీ ఆ కొలవెరి కుర్రాడు మాత్రం జెండా పాతేస్తున్నాడు. టాలీవుడ్ టెక్నిషియన్లకు దడ పుట్టిస్తున్నాడు. చూడబోతుంటే… ఫ్యూచర్ మొత్తం కుర్రాడిదే అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైన‌ట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడూ మాత్రమే అనిరుధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది. కానీ ఇకపై తరుచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఫుల్ […]