Hyderabad : శ్రీచైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ తోపాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా నగదు లభించినట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.