HYD-VJA Highway : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాదారులకు ఎన్‌హెచ్ఏఐ శుభవార్త చెప్పింది. టోల్ రుసుము తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తగ్గిన టోల్ ఫీజులు అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వరకు కొత్త రేట్లు అమలులో ఉండనున్నాయి.
