Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో వర్దమాన నటులు, బుల్లితెర నటులు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కి యువత బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
