Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహుర్తం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు మొదలయ్యాయి. 2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. రూ.1587కోట్లతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు.