AP Telangana Today : ఏపీ, తెలంగాణలో ఇవాళ జరగబోయే కార్యక్రమాలు.. 10 ముఖ్యాంశాలు
AP Telangana Today : తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు పెరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కొండగల్లో పర్యటించనున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ.. గురుకుల ప్రవేశాల ఫలితాలు విడుదల వంటి ఏపీ, తెలంగాణకు సంబంధించి నేటి 10 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం…. బలవంతంగా కలుపు మందు తాగించిన ప్రియుడు – వివాహిత మృతి..!
ఏలూరు జిల్లాలో దారుమం జరిగింది. ప్రేమ పేరుతో వివాహిత మహిళను లోబర్చుకున్న ఓ యువకుడు… ఆమెకు బలవంతంగా కలుపు మందు తాగించాడు. ఈ ఘటనలో సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు…. కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం
APRS Admissions 2025 : ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు – దరఖాస్తుల గడువు పొడిగింపు
AP Residential Educational Admissions 2025 : గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా 5వ తరగతితో పాటు 6,7,8 తరగతిలోని ఖాళీ సీట్లు భర్తీ చేస్తారు.
Vontimitta Brahmotsavalu 2025 : ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – 6 నుంచి బ్రహ్మోత్సవాలు
Vontimitta Brahmotsavalu 2025 Updates : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణం ఉంటుంది.
AP SSC Exams 2025 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ – ఏప్రిల్ 1న సోషల్ స్టడీస్ పరీక్ష
AP SSC Exams 2025 Updates: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. సోషల్ పరీక్ష తేదీని మార్పు చేసింది. మార్చి 31 కాకుండా ఏప్రిల్ 1వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
Andhra Pradesh News Live March 28, 2025: Obulapuram Mining Case : ఓబులాపురం మైనింగ్ కేసులో ముగిసిన వాదనలు – మే 6న తుది తీర్పు..!
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Obulapuram Mining Case : ఓబులాపురం మైనింగ్ కేసులో ముగిసిన వాదనలు – మే 6న తుది తీర్పు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో వాదనలు ముగిశాయి. మే 6వ తేదీన సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలిజనార్ధన్రెడ్డితో పాటు పలువురు ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. తుది తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
CPM Mahadharna : ఇళ్ల స్థలాల కోసం కదంతొక్కిన కామ్రేడ్లు – విజయవాడ కలెక్టరేట్ వద్ద మహాధర్నా
CPM Maha Dharna at Vijayawada : సీపీయం ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద పేదలు మహాధర్నా నిర్వహించారు. ఇల్లు కేటాయించాలని… పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల స్థలాల విషయంపై దృష్టి పెట్టాలన్నారు.
CBN in Chennai : ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోంది.. భవిష్యత్ భారతీయులదే : చంద్రబాబు
CBN in Chennai : ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని అభిప్రాయపడ్డారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.
AP Ration e-KYC : నత్తనడకన ఈకేవైసీ ప్రక్రియ – బారులు తీరుతున్న ప్రజలు, తప్పని ఇక్కట్లు…!
Ration e-KYC Registrations in Andhrapradesh : ఏపీలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. గడువు సమీపిస్తున్నప్పటికీ…. నమోదు ప్రక్రియ నత్తనడక సాగుతోంది. మరోవైపు తీవ్రమైన ఎండలో ప్రజలు బారులు తీరుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. గడువు పొడిగించాలని కోరుతున్నారు.
AP LAWCET 2025 Updates : దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల వరకు…! ఏపీ లాసెట్ ముఖ్య తేదీలివే
AP LAWCET Notification 2025 : ఏపీ లాసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించాలి. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. టీడీపీకి 37, జనసేనకు 8.. పూర్తి వివరాలు ఇవే
AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి మొత్తం 705 పదవులను భర్తీ చేసింది. వీటిల్లో ఎక్కువగా టీడీపీకే దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.