Andhra Pradesh News Live March 18, 2025: AP Heat Wave : ఏపీలో ఎండల తీవ్రత, రేపు 58 మండలాల్లో వడగాల్పులు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Vizag Port Jobs : విశాఖ‌ప‌ట్నం పోర్టులో 24 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల, పూర్తి వివ‌రాలివే

Vizag Port Jobs : విశాఖపట్నం పోర్టులో వివిధ కేటగిరీల్లో 24 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌ https://vpt.shipping.gov.in/ లోని కెరీర్‌లో పూర్తి వివ‌రాలు తెలిపారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు.

AP Medical Jobs : తూర్పు గోదావ‌రి జిల్లాలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. పూర్తి వివ‌రాలు ఇవే

AP Medical Jobs : తూర్పు గోదావ‌రి జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల‌ భర్తీ నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. మొత్తం 30 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిల్లో 6 రకాల పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వేతనం ఇస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Srikakulam Crime : బిస్కెట్లు ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడి అస‌భ్యక‌ర ప్రవ‌ర్తన‌-పోక్సో కేసు న‌మోదు

Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల చిన్నారితో 80 ఏళ్ల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బిస్కెట్లు ఆశ చూపి చిన్నారిని సెల్లార్ లోకి తీసుకెళ్లి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. బాలక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

YSR Kadapa : జాయింట్ క‌లెక్ట‌ర్ ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. కారణం ఇదే

YSR Kadapa : వైద్యుల నిర్ల‌క్ష్యంతో మ‌హిళ‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకింది. చికిత్స కోసం హైద‌రాబాద్ తీసుకెళ్లి ల‌క్షల్లో ఖ‌ర్చు చేశారు. ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డానికి కార‌ణమైన వారిపై చర్య‌లు తీసుకోవాల‌ని, న్యాయం చేయాల‌ని క‌లెక్ట‌రేట్ చుట్టూ కాళ్లు అరిగేలా బాధిత కుటుంబం తిరిగింది. అధికారులు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.

Konanki Sudikhsa Parents: కోణంకి సుదిక్ష చౌదరి మరణాన్ని ధృవీకరించాలని డొమనికన్‌ రిపబ్లిక్‌ను కోరిన తల్లిదండ్రులు

Konanki Sudikhsa Parents: డొమనికన్‌ రిపబ్లికన్‌ దేశంలో విహార యాత్రకు వెళ్లి అదృశ్యమైన ప్రవాసాంధ్ర యువతి కోణంకి సుదీక్ష  చౌదరి మరణాన్ని ధృవీకరించాలని ఆమె తల్లిదండ్రులు  విజ్ఞప్తి చేశారు. ఉత్తర అమెరికా దేశమైన డొమనికన్‌ రిపబ్లిక్‌లో  సముద్ర తీరంలో మార్చి 6న సుదీక్ష  అనుమనాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. 

BITS and Deeptech: అమరావతిలో బిట్స్‌ కు 75 ఎకరాలు కేటాయింపు…డీప్‌ టెక్‌ యూనివర్శిటీ ఏర్పాటవుతుందన్న లోకేష్‌

BITS and Deeptech: అమరావతి బిట్స్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు 75ఎకరాలను కేటాయించినట్టు మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రైవేట్, ఫారిన్ వర్శిటీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. అమరావతిలో డీప్‌ టెక్‌ యూనివర్శిటీ, విశాఖలో ఏఐ వర్శిటీలు వస్తాయని చెప్పారు. 

AP Liquor Scam: లిక్కర్ కొనుగోళ్లలో బిగుస్తున్న ఉచ్చు, వైసీపీ ముఖ్య నేతలే అసలు టార్గెట్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన MP

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019-2024 మధ్య కాలంలో మద్యం విక్రయాలు, ఆర్డర్లలో భారీగా అక్రమాలు జరిగాయని కూటమి అనుమానిస్తోంది. దీనిపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Sudeeksha Konanki: డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు యువతి అదృశ్యం, అమెరికాలో స్థిరపడిన కడప వాసులు, తల్లడిల్లుతున్నకుటుంబం

Sudeeksha Konanki: ఉత్తర అమెరికా దేశమైన డొమినికన్ రిపబ్లిక్ దేశంలో తెలుగు యువతి అదృశ్యమైంది. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుదీక్ష కోణంకి పీట్స్‌బర్గ్ యూనివర్శిటీలో చదువుతున్నారు. మార్చి 3న స్నేహితురాళ్లతో కలిసి విహార యాత్రకు వెళ్లిన సుదీక్ష మార్చి 6న అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. 

West Godavari Crime : ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘోరం.. మ‌త్తు మందు ఇచ్చి వివాహిత‌పై సామూహిక‌ అత్యాచారం!

West Godavari Crime : ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఘోర‌ం జరిగింది. మ‌త్తుమందు ఇచ్చి వివాహిత‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. న‌గ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్ప‌డుతున్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. బాధితులు ఏలూరు రేంజ్ ఐజీని ఆశ్ర‌యించారు.

AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇవాళ్టి ముఖ్యమైన 7 అంశాలు

AP Telangana Today : ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇవాళ సభ ముందుకు ఆరు బిల్లులు రానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వైఎస్ జగన్ ఇవాళ మేదరమెట్లకు వెళ్లనున్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇలాంటి 7 ముఖ్యమైన అంశాలు.

SC Categorization: ఏపీలో రాష్ట్రం యూనిట్‌గానే ఎస్సీ వర్గీకరణ అమలు, 2026 తర్వాత జిల్లా యూనిట్‌ చేసే ఛాన్స్‌!

SC Categorization: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌గా అమలు చేయాలని ఏపీ క్యాబినెట్‌ నిర్ణయించింది.  ప్రభుత్వ నిర్ణయంపై మాదిగ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణకు  అమోదం లభించడంతో త్వరలో డిఎస్సీ వెలువడనుంది.