AP TG Weather Report : ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ -రేపు 59 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి నుంచి వర్షాలు
AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. రేపు ఏపీలో పొడి వాతావరణం ఉంటూ 59 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. ఎల్లుండి నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Andhra Pradesh News Live March 19, 2025: AP TG Weather Report : వెదర్ అప్డేట్స్ -రేపు ఏపీలోని 59 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Ugadi Awards : ఈ నెల 30న విశ్వసునామ ఉగాది వేడుకలు- 14 రంగాల్లో ప్రముఖులకు కళారత్న, ఉగాది అవార్డులు
Ugadi Awards : ఈ నెల 30న విశ్వసునామ ఉగాది వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో 14 రంగాలలో సేవలందించిన ప్రముఖులకు కళారత్న అవార్డులు, ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
CBN Meets Billgates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై కీలక ఒప్పందం
CBN Meets Billgates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీలో ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Guntur Robbery : ప్రేమపెళ్లికి తల్లిదండ్రులు నిరాకరణ, ప్రియుడితో సొంత ఇంట్లోనే చోరీ చేయించిన యువతి
Guntur Robbery : ప్రేమికుడితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని…ప్రియుడితో సొంత ఇంటికే కన్నం వేయించింది యువతి. ఇదే అదునుగా ప్రియుడు రూ.90 లక్షల విలువైన నగలు చోరీ చేసి పరారయ్యాడు. ఈ వింత చోరీ గుంటూరు జిల్లాలో జరిగింది.
Kapu Corporation Loans : సబ్సిడీపై కాపు కార్పొరేషన్ లోన్లు- దరఖాస్తు విధానం, అర్హతలు, పూర్తి వివరాలివే
Kapu Corporation Loans : కాపు సామాజిక వర్గాల్లో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తుంది. చంద్రన్న స్వయం ఉపాధి, గ్రూప్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద 50 శాతం వరకు సబ్సిడీతో రుణాలు అందిస్తు్ంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
ANU Distance Admissions 2025 : దూరవిద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ – 23న ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రెన్స్ పరీక్ష
Acharya Nagarjuna University Admissions 2025 : ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్చి 23న ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది.
Tirumala : ఈనెల 25న శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం – పలు సేవలు రద్దు
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి 25వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానం ఉంటుందని పేర్కొన్నారు.
Whatsapp Governance: జూన్ నాటికి ఏపీలో వాట్సాప్ లో 500రకాల పౌరసేవలు.. 100రోజుల్లో ఏఐ సేవలు షురూ..
Whatsapp Governance: ఏపీలో ఈ ఏడాది జూన్ 30నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మనమిత్రలో వాట్సాప్ ద్వారా అందిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వాట్సాప్ పౌర సేవలు సమర్ధవంతంగా ప్రజలకు సేవల్ని అందిస్తున్నట్టు చెప్పారు.
Minor Gang Rape: కృష్ణా జిల్లాలో ఘోరం.. మైనర్ బాలికను బంధించి గ్యాంగ్ రేప్, ఏడుగురిని గుర్తించిన పోలీసులు
Minor Gang Rape: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్నేహితురాలి ఇంటికి వెళ్ళిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆటో డ్రైవర్ చొరవతో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుల్ని గుర్తించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మైనర్లు కూడా ఉన్నారు.
Andhra Loyola Autonomous: విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ అటానమస్ హోదా రద్దు.. వాకింగ్ వివాదం తర్వాత నాటకీయ పరిణామాలు
విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ అటానమస్ హోదాను కృష్ణా యూనివర్శిటీ రద్దు చేసింది. లయోలా కాలేజీ ప్రాంగణంలో వాకర్లను అనుమతించే విషయంలో తలెత్తిన వివాదంతో గత కొన్ని నెలలుగా జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య ఈ ఘటన జరిగింది.
AP Heat Wave : ఏపీలో తీవ్రమవుతున్న ఎండలు, రేపు 58 మండలాల్లో వడగాల్పులు
AP Heat Wave : ఏపీలో భానుడు భగభగలాడుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. రేపు 58 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.