Pawan Kalyan : మే నెలాఖరు లోపు 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణం పూర్తి – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan : అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు వల్ల పల్లె పండుగ విజయవంతం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బలమైన, అనుభవశీలి అయిన ముఖ్యమంత్రి ఉంటే నాలంటివారు నేర్చుకుంటారన్నారు. కర్నూలు జిల్లా పుడిచర్ల గ్రామంలో పంట కుంట నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు.

Delimitation Politics : డీలిమిటేషన్‌పై స్పందించిన జగన్, షర్మిల.. మోదీకి లేఖ రాసిన వైసీపీ చీఫ్

Delimitation Politics : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్, షర్మిల దీనిపై స్పందించారు. జగన్ పీఎం మోదీకి లేఖ రాశారు. 2026 డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

AP EAPCET Free Tests 2025 : ఏపీ ఈఏపీసెట్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? వెబ్ సైట్ లో ‘మాక్ టెస్ట్’ ఆప్షన్ – ఇలా రాసుకోవచ్చు

AP EAPCET 2025 Updates : ఏపీ ఈఏపీసెట్‌ కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఎంట్రెన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికి అధికారులు కీలక అప్జేట్ ఇచ్చారు. ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం కల్పించారు. ఏపీఈఏపీసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని రాసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి….

AP Midday Meal : ఆకలి తీర్చే ఆశయం.. అమలులో అయోమయం..! పీపుల్స్ పల్స్ విశ్లేషణ

AP Midday Meal : ఓ మారుమూల పల్లెటూరులో పొద్దున్నే లేచిన ఓ విద్యార్థి.. అన్నం తినకుండానే బస్సెక్కి చదువు కోసం కాలేజీకి చేరుకున్నాడు. అతనికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం వడ్డిస్తే.. అది చల్లారి, రుచి లేని నీళ్ల కూరతో ఉంది. చేసేదేమీలేక పెట్టిన గుడ్డు తిని, మిగతా భోజనం పారేశాడు.

Sri Sathyasai District : హిందూపురంలో గుట్టుగా వ్యభిచార దందా – మహిళా అరెస్ట్, తెరవెనక కానిస్టేబుల్…!

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురంలో సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ గృహాన్ని నడుపుతున్న మహిళతో పాటు సహకరించిన కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Konaseema Crime : ప్రియుడితో క‌లిసి తండ్రిని హ‌త‌మార్చిన కుమార్తె.. కోన‌సీమ జిల్లాలో దారుణం

Konaseema Crime : కోన‌సీమ జిల్లాలో దారుణ‌ం జరిగింది. కుమార్తె వివాహేత‌ర సంబంధం పెట్టుంది. ఆ విష‌యం తెలిసి తండ్రి మంద‌లించాడు. కోపం పెంచుకుని ప్రియుడితో క‌లిసి తండ్రిని కుమార్తె అతికిరాత‌కంగా హ‌త‌మార్చింది. మృతుడి సోద‌రుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేపట్టారు.

AP Fee Reimbursement : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ – ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 600 కోట్లు విడుదల

AP Fees Reimbursement : ఏపీలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.600 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ప్రకటన విడుదల చేశారు. మిగతా రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.

AIBE 19 Results 2025 : ‘లా’ అభ్యర్థులకు అలర్ట్… ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

All India Bar Examination XIX Results: ఏఐబీఈ 19 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మార్చి 6వ తేదీన ఫైనల్ కీ రాగా… శుక్రవారం ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Andhra Pradesh News Live March 21, 2025: AP Teachers Transfers 2025 : టీచర్ల సీనియారిటీ జాబితా విడుద‌ల‌ – అభ్యంత‌రాల స్వీకరణకు అవకాశం…!

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

AP Teachers Transfers 2025 : టీచర్ల సీనియారిటీ జాబితా విడుద‌ల‌ – అభ్యంత‌రాల స్వీకరణకు అవకాశం…!

Andhra Pradesh Teachers Transfers : రాష్ట్రంలోని ఉపాధ్యాయ ప‌దోన్న‌తుల కోసం సీనియారిటీ జాబితా విడుద‌ల చేశారు. జిల్లా స్థాయిలోనే డీఈవోలు జాబితాల‌ వివరాలను ప్రకటించారు. ఈ సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంత‌రాలు ఉన్నా ఈనెల 26వ తేదీలోపు తెలుపవచ్చని పేర్కొన్నారు.

Visakhapatnam Master Plan : విశాఖపట్నం అభివృద్ధికి కొత్త మాస్టర్ ప్లాన్.. నాలుగు నెలల్లో క్లారిటీ!

Visakhapatnam Master Plan : విశాఖపట్నం.. వేగంగా అభివృద్ధి చెందే నగరం. అందుకే ప్రభుత్వం వైజాగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా మంత్రి నారాయణ విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్టు స్పష్టం చేశారు.

Vangaveeti Radha : రాజకీయాలకు రాంరాం.. వంగవీటి రాధాపై ఎందుకీ ప్రచారం జరుగుతోంది?

Vangaveeti Radha : వంగవీటి రాధా.. ఈ పేరు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. అందుకు కారణం ఆయన తండ్రి రంగా. కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన రంగా.. దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రాధా.. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఏ పదవీ రాలేదు.