ఆర్మీ క్రమశిక్షణ నుంచి మిస్ ఇండియా వరకు మీనాక్షి చౌదరి ఇన్స్పిరింగ్ జర్నీ

‘‘నాన్న ద్వారా వచ్చిన ప్రపంచజ్ఞానం నాకు మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడానికి దోహదపడింది. హీరోయిన్ అవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది మా నాన్న ఆశీర్వాదంతోనే సాధ్యమైంది’’ అంటూ మీనాక్షి ఆనందం వ్యక్తం చేసింది.
ఆర్ఆర్ఆర్ వెనుక కధ డాక్యుమెంటరీ రూపంలో విడుదలకు సిద్ధం

ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభించి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, చిత్రబృందం ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్రకటించింది. “RRR: Behind & Beyond” పేరుతో ఈ సినిమాపై డాక్యుమెంటరీను అనౌన్స్ చేశారు. ఈ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం వెనుక ఉన్న అనేక ఆసక్తికర అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ నెలలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ కు రౌడీ హీరో వాయిస్ ఓవర్

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా, విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ అందించడం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజయ్ దేవరకొండ చెప్పిన “నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా” అనే మాటలు రష్మిక విజువల్స్‌తో మిళితమై టీజర్‌కి మంచి ఎమోషన్‌ను తెచ్చాయి. మొత్తం టీజర్ సినిమా అంచనాలను మరింత పెంచుతూనే, రష్మిక నటనపై ఆసక్తిని పెంచింది.
ఏం మ్యాజిక్ చేసినా హిట్ కొట్టాలి అంటోన్న యంగ్ డైరెక్టర్స్ ..!

ఇండస్ట్రీలో నిలవడం కోసం దర్శకులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. క్లాస్ సినిమాల నుంచి మాస్ సినిమాలు, యూనివర్స్‌ల వరకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. హిట్ కోసం తీసుకునే ఈ ప్రయత్నాలు వారికి కొత్త గమ్యాలను అందిస్తాయి. “హిట్టు ముఖ్యం బిగిలూ” అనే ఆలోచనతో దర్శకులు తమను తాము అప్‌డేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ దద్దరిల్లలసిందే ..!

యూఎస్‌ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది .ఇక దీనిపై అధికారిక ప్రకటన జారీ చేశారు మేకర్స్. టెక్సాస్‌లోని డల్లాస్‌లో 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది.Texas Trust CU Theatre ఈవెంట్‌కు వేదిక కానుంది. మాస్ పేలుడును వీక్షించుకునే మిమ్మల్ని మీరు సన్నద్దం చేసుకోండి.. అంటూ వార్తను అందరితో షేర్ చేసుకుంది బాలకృష్ణ టీం.
యానిమల్’ సీక్వెల్ పై సందీప్ రెడ్డి వంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ ..

యానిమల్ తనకు ఎన్నో కలలను నెరవేర్చిన సినిమా అని, సినిమా విడుదలైన తర్వాత ప్రజల నుండి ప్రేమ, ఆశీర్వాదాలు పొందుతున్నాడని సందీప్ వంగా తెలిపారు. “29 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న నాకు ఈ సినిమా ఒక కొత్త అవకాశం ఇచ్చింది. ఇప్పుడు నా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఇంకా, సీక్వెల్ ఉంటే బాబీ డియోల్ పాత్ర ఎలా ఉంటుందన్నది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు వెల్లడవాల్సి ఉంది.
2025 సంక్రాంతికి 3 భారీ సినిమాలు ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల!

2025 సంక్రాంతికి 3 భారీ సినిమాలు ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల! 2025 సంక్రాంతికి కూడా కొన్ని సాలిడ్ సినిమాలు మన స్టార్ హీరోల నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇంతకు మించి, ఈ చిత్రాలు యూఎస్ మార్కెట్‌లో ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల అవుతుండడం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” మరియు బాలయ్యతో “డాకు మహారాజ్” వంటి మాస్ మూవీ , ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజవుతాయనిశ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అలాగే, ఈ సంస్థ నుంచి మరో కొత్త చిత్రంగా వెంకటేశ్, అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “సంక్రాంతికి వస్తున్నాం” కూడా విడుదల అవుతున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు.
బాబీ నెక్స్ట్ సినిమా మళ్ళీ మెగాస్టార్ తోనే .. ఈసారి అంతకు మించి ..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో విశ్వంభర సినిమా మాత్రమే ఉంది , ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల , అనిల్ రావిపూడి తో సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి .. ఇక మెగా లైన్ అప్ లో “వాల్తేరు వీరయ్య” కాంబినేషన్ కూడా ఉన్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే ..
కంగువా మూవీ ఓటీటీలో కొత్త వెర్షన్ .. ప్రేక్షకులకు కాస్త రిలీఫ్..!

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిసాస్టర్ టాక్ అందుకుంది , అయితే ఈ చిత్రం మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసి, ఈ రోజు నుంచి సినిమాను అందుబాటులో ఉంచింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన వెర్షన్ థియేటర్ వెర్షన్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది ..ఇక థియేటర్స్ చూడని కొన్ని సీన్స్, పాటలను కూడా కట్ చేసి ఓటీటీలోకి విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ లో, అలాగే రెండో పార్ట్ లో కూడా కొన్ని సీన్స్ కట్ చేసినట్లు తేకూస్తోంది . ముఖ్యంగా, ఫస్ట్ ఆఫ్ లో సూర్య, దిశా పటాని మధ్య ఉన్న సాంగ్ ను కూడా కట్ చేసినట్లు టాక్ . మొత్తం మీద, ఈ చిత్రం 12 నిమిషాల మేర కట్ అయినట్లు తెలుస్తోంది.
నా టార్గెట్ వాళ్లే.. నో-డౌట్ పక్కా మాస్ హీరో స్థానంలో నాని పేరు ఉండాల్సిందే..!

ప్రస్తుతం, నాని నటిస్తున్న హిట్ 3 పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిపోతోంది. టీజర్ విడుదలయ్యే సరికి సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. హిట్ 3 తర్వాత, నాని శ్రీకాంత్ ఓదెలతో కలిసి పారడైజ్ అనే మాస్ సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని క్యారెక్టర్ కూడా మాస్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత, సుజీత్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నారు. ఇలా నాని కమిట్ అయిన ప్రతి సినిమా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసుకోవడం విశేషం ..
అన్ స్టాపబుల్ షోలో.. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టిన శ్రీలీల

అన్ స్టాపబుల్ షోలో.. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టిన శ్రీలీల
కూలీ సినిమా లేటెస్ట్ అప్ డేట్ .. సూపర్ స్టార్ తో అమీర్ ఖాన్ ఇంట్రస్టింగ్ బజ్..

కూలీ సినిమా లేటెస్ట్ అప్ డేట్ .. సూపర్ స్టార్ తో అమీర్ ఖాన్ ఇంట్రస్టింగ్ బజ్..