“గేమ్ ఛేంజర్” ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

అయితే ఈ సినిమా అభిమానులను కొంత వరకు నిరాశపరుస్తోంది, ఇందుకు గల కారణం లేట్‌గా స్టార్ట్ అయిన ప్రమోషన్‌లకు మరోసారి గ్యాప్ రావడమే.. సినిమా రిలీజ్‌కు కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ట్రైలర్ గానీ, ఇతర పాటల పై గానీ ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు .. అయితే తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” ట్రైలర్‌ను డిసెంబర్ చివరి నాటికి విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది
మిరాయ్ సినిమాలో శ్రేయ శరన్ స్పెషల్ సాంగ్

మిరాయ్” చిత్రంలో పలువురు స్టార్ నటులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. తాజాగా, ఈ చిత్రంలో మరో ఆసక్తికర యాడిషన్ జోడించబడినట్టుగా టాక్ వినిపిస్తోంది. శ్రియ శరన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, కానీ ఫ్యాన్స్ మధ్య ఉత్సాహం మొదలైంది.
హరిహర వీరమల్లు నుండి లేటెస్ట్ అప్ డేట్

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొంటూ యాక్షన్ మోడ్‌లోకి మారారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక వర్కింగ్ స్టిల్ విడుదల చేయగా, అది అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ తెలిపారు.
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుకుమార్

ఈ ఈవెంట్ కోసం “పుష్ప 2” తో భారీ హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరుకానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్‌తో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పుష్ప 2 పనులు పూర్తయిన తర్వాత, ఆయనకు ఖాళీ సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఈవెంట్‌కు హాజరవుతారన్న ఊహాగానాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ఫరాజ్ మేనియా .. అసలు తగ్గేదెలే.. !

పుష్ప 2 సక్సెస్‌ను ఏమాటల్లో చెప్పాలో కూడా అర్థం కావడంలేదు. బాక్సాఫీస్‌ను రప్పా.. రప్పా.. ఊచకోత కోసేస్తున్నాడు పుష్ప రాజ్. అక్కడా, ఇక్కడా అన్న తేడాలేదు.. ఆలోవర్ ఇండియా బాక్సాఫీస్ ను వైల్డ్ ఫైర్ లా ముంచెత్తుతోంది. రికార్డులను తగలబెట్టేస్తోంది ఆ సెగకు రోజువారి సినీ రికార్డులన్నీ అహుతైపోతున్నాయి. ఇప్పటికే ఇండియాలోని అన్ని చిత్రాల రికార్డుల్ని పుష్ప 2 బద్దలు కొట్టేసింది. అత్యంత వేగంగా 500, 600, 700 కోట్లు రాబట్టిన చిత్రంగానూ పుష్ప 2 రికార్డులకెక్కింది. అంతటితో ఆగిపోకుండా నాలుగు రోజుల్లో 829 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి.. ఈ ఫీట్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచి.. టాలీవుడ్ కాలర్‌ను ఎగరేసింది. అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ.. అత్యంత వేగంగా 900, 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాను సరికొత్త చరిత్రను లిఖించబోతోంది.
డాకు మహారాజ్‌లో బాలయ్య నటవిశ్వరూపం చూస్తారు. !

బాలయ్య సినిమాలకు తమన్ అందించిన మ్యూజిక్ భారీ విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషించింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు సృష్టించిన సెన్సేషన్‌ను మరింత అధిగమించి, డాకుమహారాజ్ సినిమా కూడా అదే స్థాయిలో మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుందని నందమూరి ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు
ప్రభాస్ బిజీ షెడ్యూల్ .. ఏడాదికి రెండు రిలీజ్‌లతో ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ..!

ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం ఫ్యాన్స్‌ను ఎంతో ఆనందానికి గురి చేస్తోంది. అయినా, ప్రభాస్ లాంటి పాన్-ఇండియా స్టార్‌తో 90 రోజుల్లో సినిమా పూర్తి చేయడం సాధ్యమా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఈ విషయంలో దర్శక-నిర్మాతల ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
గోపీచంద్ డేరింగ్ స్టెప్ ..నెక్స్ట్ మూవీ ఘాజీ డైరెక్టర్ తో.. !

సంకల్ప్ రెడ్డి కథల ప్రత్యేకత, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందడం. కానీ ఈసారి అదే ఫార్మాట్‌లో వెళ్తాడా లేదా కొత్త జానర్ ఎంచుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా సంకల్ప్ కెరీర్ తీరును నిర్ణయించే ప్రాజెక్ట్‌గా మారనుంది.
గురూజీ కోసం బన్నీ మేకోవర్..!

అల్లు అర్జున్ ప్రస్తుతం తన గడ్డంతో కనిపిస్తూనే ఉన్నాడు. కానీ త్రివిక్రమ్ కోసం ఆయన పూర్తి మేకోవర్ కానున్నాడట. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను 2025 జూన్ తర్వాత సెట్స్‌పైకి తీసుకురాబోతోంది. సంక్రాంతి 2024 తర్వాత ఒక స్పెషల్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఫైనల్ గా తంగలాన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి .. !

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వలేదు , ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు , ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు కోర్టు కేసులు, నిర్మాణ సంస్థకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ఉన్న విభేదాలు. అయితే, అనూహ్యంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంగళవారం ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చింది. గత నెలలో కోర్టు నుంచి సినిమా రిలీజ్‌కు క్లియరెన్స్ రావడంతో ఈ విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో 829 కోట్ల వసూళ్లు

పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే రూ. 294 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు రూ. 155 కోట్లు, మూడో రోజు శనివారం రూ. 172 కోట్లు కలిపి మూడు రోజుల్లో మొత్తం రూ. 621 కోట్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఆదివారం ఈ చిత్రం అసలు సిసలు ప్రభంజనాన్ని సృష్టించింది. ఒక్క రోజే రూ. 208 కోట్లు వసూలు చేసి, మొత్తం నాలుగు రోజుల్లో రూ. 829 కోట్ల వసూళ్లను సాధించింది.
బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయనున్నారా? మహేశ్ బాబుతో జక్కన్న మాస్టర్ ప్లాన్

బాహుబలి 2తో భారతీయ సినీ ఇండస్ట్రీకి కొత్త గమ్యాన్ని నిర్దేశించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆ సినిమా తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌తో మరో భారీ విజయం అందుకున్నారు. అయితే, ఆయన స్వయంగా సృష్టించిన బాహుబలి 2 రికార్డును ఇప్పటికీ అందుకోలేకపోయారు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌తో తన రికార్డును బ్రేక్ చేయాలని రాజమౌళి సిద్ధమవుతున్నారు.