ఆ క్లాసిక్ టైటిల్ తో లావణ్య త్రిపాఠి కొత్త సినిమా

డిసెంబర్ 15న లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో లావణ్య డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ క్లాసిక్ ఎంటర్‌టైనర్ ‘సతీ లీలావతి’ టైటిల్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఆర్ సీ 16 స్టోరీ నాకు ముందే తెలుసు కానీ ఆ రోల్ కి నేను సెట్ కాదు అని అంటోన్న విజయ్ సేతుపతి

తాజాగా “విడుదల పార్ట్ 2” ప్రమోషన్స్‌లో కూడా విజయ్ సేతుపతి మరోసారి స్పందించారు. “ఈ సినిమా కథ నాకు తెలుసు. కానీ, ఈ కథలో నా పాత్ర సరిపోయేలా లేదు. పైగా, ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను,” అని విజయ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలతో, బుచ్చిబాబు సానా టీమ్ విజయ్ సేతుపతిని అప్రోచ్ చేసిన విషయం నిజమని అర్థమవుతుంది.
వెట్రిమారన్ స్టోరీతో గౌతమ్ వాసుదేవ్ మీనన్..ట్విస్ట్ అదిరిపోలా ..!

టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ వెట్రిమారన్ ఇచ్చిన కథతో సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోగా యంగ్ హీరో శింబు నటిస్తాడని టాక్. ….
ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ రష్మిక క్యూట్ లుక్స్ కి ఫిదా ..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తోంది .. అలానే రష్మిక తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ తెమిలియజేసింది .. ఇక ఈ చిత్రం నుండి రీసెంట్‌గా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్…… ఇప్పుడు ఈ టీజర్ కు 20 మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా మేకర్స్ వెల్లడించారు
గెట్ రెడీ NBK ఫ్యాన్స్ ..ఈ నెల 20 నుండి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్

ఇక ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు
మాస్ రాజా రవితేజ 75వ సినిమా లేటెస్ట్ అప్ డేట్ పండుగ వాతావరణంలో మాస్ మహారాజ్..!

రవితేజ కెరీర్ లో 75 వ సినిమా చాలా స్పెషల్ , ఇక ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు .. ఇక ఈ సినిమా పేరు ‘మాస్ జాతర’ అని నిర్ణయించబడింది. అలానే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మాస్ జాతర – షూటింగ్ రిపోర్ట్స్ ఇటీవల రవితేజ చేతికి సర్జరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ గాయం నుంచి కోలుకున్నాక తిరిగి మళ్ళీ మాస్ జాతర సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు .. ఇక యూరప్ లోని నార్వే ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. మంచులో షూటింగ్ చేయడం, పండుగ వాతావరణంలో సన్నివేశాలు చిత్రీకరించడం సినిమాకు హాయ్ లైట్ అని తెలుస్తోంది ..
పుష్ప 2 చూసిన వెంకీ..అల్లు అర్జున్ నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా..అంటూ పోస్ట్ !

విక్టరీ వెంకటేష్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ, “అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ గారికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు చిత్ర బృందానికి నా అభినందనలు,” అని సోషల్ మీడియా లో తన అభిపార్యాయాన్ని తెలియజేసారు .. విక్టరీ వెంకటేష్ పుష్ప 2 ట్రేడ్ మార్క్ డైలాగ్ “అస్సలు తగ్గేదేలే” అంటూ చివర్లో క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హాలీవుడ్‌లో మరోసారి అదరగొట్టేందుకు ధనుష్ సిద్ధం.. !

ఇప్పుడు, ధనుష్ మూడోసారి హాలీవుడ్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి ఆయన నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ అని ప్రకటించబడింది. ఈ సినిమాను సోనీ సంస్థ నిర్మించనుంది, మరియు హాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.
తాండవం… అఖండ తాండవం అంటూ అఖండ 2 స్పెషల్ వీడియో రిలీజ్

ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఇందులో బాలకృష్ణ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ “ఈ నేల అసురుడిది కాదు రా… ఈశ్వరుడిది… పరమేశ్వరుడిది… కాదని తాకితే జరిగేది తాండవం… అఖండ తాండవం…” అతను ఈ డైలాగ్‌తో ఓ కొత్త లెవెల్‌ను సెట్ చేశాడు. ఈ వీడియోతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు కూడా తెలియజేసారు.
అక్కడ కూడా పుష్ప-2 సూపర్ హిట్ బాక్సాఫీస్‌పై అల్లు అర్జున్ సునామీ!

పుష్ప-2: ద రూల్, బాక్సాఫీస్ లో వరుస రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా 6 రోజుల్లో రూ. 1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ఇండియన్ సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం రాసింది. ఇదే దశలో, ఈ సినిమా ‘పుష్ప-2’ భారతీయ సినిమాలలోనే అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం
జెట్ స్పీడ్ లో “OG” మూవీ షూటింగ్ ..! పవన్ ఫ్యాన్స్ కు బ్లాస్టింగ్ అప్ డేట్

ప్రస్తుతం, “OG” తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లో కూడా జరుగుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే టీం అక్కడ ల్యాండవ్వడమే కాదు, పవన్ లేని సీన్స్‌ని కూడా చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ చివర్లో పవన్ కళ్యాణ్ షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా, “హరిహర వీరమల్లు” సినిమాను కూడా త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, 2025లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.
నోటి దుర్వాసన త్వరగా పోవాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే .. !

నోటి దుర్వాసన అనేది అనేక మంది ఎదుర్కొనే ఇబ్బందిగా మారింది. ఇది కేవలం మాటలు మాట్లాడటానికే కాక, వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా తగ్గించేదిగా ఉంటుంది. చాలా సందర్భాలలో, ఈ సమస్యకు కారణం చెడు ఆహారపు అలవాట్లు, రెండు సార్లు బ్రష్ చేయకపోవడం, నాలుక శుభ్రం చేయకపోవడం, రాత్రి బ్రష్ చేయకుండా నిద్రపోవడం వంటి చెడు అలవాట్లే కారణం. అయితే మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లతో ఈ సమస్యని పరిష్కరించవచ్చు. కానీ ఇంట్లో ఉండే కొన్ని సహజ వస్తువులతో కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. .