గేమ్ ఛేంజర్ కి టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో ముఖ్యమైన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గేమ్ చేంజర్ చిత్ర బెనిఫిట్ షోలు మరియు ఇతర షోలకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి […]
ఒక కలెక్టర్ కు, మంత్రికి జరిగిన పోరాటమే గేమ్ చేంజర్: శంకర్

“గేమ్ చేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ చేసిన వ్యాఖ్యలు చిత్రంపై ఉన్న ఆశలు, ఆయన భావోద్వేగాలను చూపిస్తాయి. ముఖ్యంగా, తెలుగులో ఓ స్ట్రెయిట్ చిత్రం చేయాలనే తన చిరకాల కోరిక ఇప్పుడు “గేమ్ చేంజర్” ద్వారా నెరవేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలుగులో అభిమానులను గెలుచుకోవడం తనకు గర్వకారణంగా ఉందని, అదే ప్రేమకు ప్రతిఫలంగా ఈ సినిమాను రూపొందించానని చెప్పారు. రామ్ చరణ్ నటనపై ఆయన చేసిన ప్రశంసలు విశేషమైనవి. “అతను […]
నేను రాగానే నన్ను కాకుండా నా హెయిర్ చూశారు

‘గేమ్ చేంజర్’ రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు వంటి భారీ పేర్లతో రూపొందిన ప్రాజెక్ట్, భారీ అంచనాలు నెలకొల్పింది. సినిమా టెక్నికల్ పరంగా అత్యున్నత ప్రమాణాలను పాటించిందని, శంకర్ ప్రత్యేకమైన దృష్టితో ప్రతీ సన్నివేశాన్ని తీర్చిదిద్దారని రామ్ చరణ్ తెలిపారు. దిల్ రాజు, శంకర్ వంటి టాప్ క్రియేటివ్స్ జట్టుకట్టి ఒక పవర్‌ఫుల్ కథను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ చరణ్ వ్యాఖ్యలు:రాజమౌళి మరియు శంకర్ లాంటి డైరెక్టర్లతో పని చేయడం తన కెరీర్‌లో […]
తిరుమల స్వామివారి సేవలో నటి జాన్వీ కపూర్

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం నాడు, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకి చేరుకుని, ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికారు మరియు ఆమె కోసం ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం, రంగనాయకుల మండపంలో పండితులు జాన్వీకి వేదాశీర్వచనం పలికారు. అనంతరం, స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. జాన్వీ కపూర్ ఇంతకుముందు కూడా పలు సందర్బాల్లో తిరుమల […]
స్క్రీన్‌పై తండ్రిని మొదటిసారి చూసి క్లీంకార

రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లీంకార, మెగా ప్రిన్సెస్, ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపించారు. ఈ వీడియోను తల్లి ఉపాసన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదిక మీద షేర్ చేశారు. “క్లీంకార తన నాన్నను మొదటిసారిగా స్క్రీన్‌పై చూస్తోంది” అంటూ ఉపాసన ఈ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మేకింగ్ వీడియోను ఉపాసన ప్రదర్శించారు, అందులో రామ్ చరణ్‌ను చూసి క్లీంకార ఆనందంతో కేకలు వేయడం కనిపిస్తోంది. చిన్నారి […]
పుష్ప 2 రికార్డులు ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ బద్దలుకొడుతుంది

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదలతో పలు రికార్డులను సృష్టిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ ట్రైలర్, శనివారం నాటికి అన్ని భాషల్లో కలిపి 180 మిలియన్ల వ్యూస్ ను సాధించి, యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ ట్రైలర్, పుష్ప 2, దేవర వంటి భారీ చిత్రాల ట్రైలర్లను అధిగమించి కొత్త రికార్డులను నెలకొల్పింది. ‘గేమ్ చేంజర్’ మూవీపై అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, ఇది […]
అల్లుఅర్జున్ మాస్టర్ ప్లాన్ ,,నెక్స్ట్ లైన్అప్ లో ఆ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ..

అల్లు అర్జున్ మరియు దర్శకుడు కొరటాల శివ గతంలో కలిసి పనిచేయాలని భావించారు, కాని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇటీవలి కాలంలో, కొరటాల శివ అల్లు అర్జున్‌ను కలసి ఒక కొత్త కథను వినిపించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ‘దేవర-2’ పూర్తవగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ జర్నీ ఒక కలలా అనిపిస్తోంది అని అంటోన్న మీనాక్షి చౌదరి

గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదలైంది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వస్తున్నాం. ఈ జర్నీ ఒక కలలా అనిపిస్తోంది. నాపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన దర్శక-నిర్మాతలకు ధన్యవాదాలు’ అని మీనాక్షి ఆనందం వ్యక్తం చేశారు.
రుక్మిణి వసంత్‌కు కొత్త అగ్రిమెంట్లలో చిక్కు!”

రుక్మిణి వసంత్ ఈ రెండు సినిమాలకు ఒప్పందాలు చేసుకున్న తర్వాత, మరిన్ని చిన్న చిన్న సినిమాలకు కూడా అంగీకరించిందని అంటున్నారు. కానీ ఈ సినిమాల షూటింగ్స్ అన్నీ ఈ ఏడాది జరగనుండగా, ఆమెకు సంతకాలు చేసిన అగ్రిమెంట్ల వల్ల పెద్ద అడ్డంకులు ఎదురవుతున్నాయి
వార్ 2’లో తారక్ డబుల్ యాక్షన్ డ్రామా?

సినిమాపై ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పాత్రలు కథలో కీలకమైన చారిత్రాత్మక భాగంగా ఉంటాయట. ప్రత్యేకంగా, ఈ రెండు పాత్రలు ఒకదానితో ఒకటి పోరాడటం కథకు హైలైట్‌గా నిలవనుందట.
మాస్ యాక్షన్ డ్రామా – 90ల గ్యాంగ్‌స్టర్ కథతో చిరు

ఈ సినిమా కథ 90ల కాలం హైదరాబాద్‌కు చెందిన ఓ గ్యాంగ్‌స్టార్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించనున్నారు. పీరియాడిక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకమైన కథ సిద్ధం చేశారు.ఈ సినిమాకు చిరంజీవి భారీగా రూ. 75 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇది మెగాస్టార్ కెరీర్‌లో అత్యధిక పారితోషికం. ఇప్పటికే మేకర్స్ చిరంజీవికి మొత్తం రెమ్యునరేషన్ చెల్లించారని సమాచారం.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ పై అల్లు శిరీష్ ప్రశంసల వర్షం

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ తాజాగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌పై స్పందించారు. ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని, రామ్ చరణ్ నటన అద్భుతమని, లుక్స్, గెటప్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా, దర్శకుడు శంకర్ ఈ సినిమాతో మళ్లీ తన వింటేజ్ మ్యాజిక్‌ను రిపీట్ చేసినట్టు కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రం సామాజిక అంశాలనూ, మాస్ హీరోయిజాన్ని మిళితం చేస్తూ ప్రేక్షకులను మెప్పించనుందని అన్నారు.