ఇండస్ట్రీలో అనిరుధ్ దూకుడు ,, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ ..!

అఖండ 2' తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో జతకట్టనున్నాడు. 2023లో వీరసింహ రెడ్డి సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ కి డెఫినేషన్ అయినా బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ అయితే మరింతా బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దాదాపుగా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ చేయనున్న ఓ నెక్ట్స్ ప్రాజెక్టులో అను ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. త్రివిక్రమ్, సందీప్ వంగాలతో బన్నీ మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీల్లో ఒకదానికి అనిరుథ్ మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

గెస్ట్ గా వచ్చాడు. అలాగే వెళ్లిపోతాడేమోలే అనుకున్నారు కానీ ఆ కొలవెరి కుర్రాడు మాత్రం జెండా పాతేస్తున్నాడు. టాలీవుడ్ టెక్నిషియన్లకు దడ పుట్టిస్తున్నాడు. చూడబోతుంటే… ఫ్యూచర్ మొత్తం కుర్రాడిదే అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైన‌ట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడూ మాత్రమే అనిరుధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది. కానీ ఇకపై తరుచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఫుల్ […]

సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న బుల్లి రాజు…!

ఈ చిత్రం విడుదల తరువాత, బుల్లి రాజు పాత్రలో నటించిన రేవంత్ కు మంచి పేరు వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్ లో మంచి మైలురాయిని చేరుకున్న రేవంత్, తాజాగా మహేష్ బాబుని కూడా కలిశాడు. ప్రస్తుతం ఈ చిన్న నటుడు మహేష్ బాబుతో మరో ప్రాజెక్ట్ లో నటించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా, అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి సినిమా తరువాత ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది.

ఈ సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ప్రేక్షకుల మనసులో లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో బుల్లి రాజు అనే పాత్రలో నటించిన చిన్న హీరో రేవంత్ (బుడ్డోడిగా) తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు , అలానే బుల్లి రాజు క్యారెక్టర్ ప్రేక్షకులను […]

సైబర్ మోసాలు – కొత్త తరహా దందాలు

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే, దాన్ని దుర్వినియోగం చేస్తూ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు రాత్రివేళ దొంగలు ఇంట్లోకి చొరబడి దోపిడీలు చేయడం సాధారణమైతే, ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఇంట్లో నుంచే క్లిక్ కొడుతూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రముఖుల పేర్లతో మోసాలు తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలకు దిగారు. ఆరడుగుల అధికారులైన జిల్లా కలెక్టర్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు దోచేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్. […]

టాలీవుడ్ లో ఐటీ దాడులు ,, క్యాష్ చెల్లింపులపైనే అధికారుల నజర్.. !

ప్రస్తుతం జరుగుతోన్న ఐటీ సోదాలలో ఈ తరహా క్యాష్ చెల్లింపులపైనే అధికారులు దృష్టి సారించారని..ఈ క్రమంలో ఎవరైనా హీరోల పై కూడా ఐటీ సోదాలు జరుగుతాయా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి… ఇక రెండు అగ్ర నిర్మాణ సంస్దలపై ఐటీ దాడులతో , మరికొందరు నిర్మాతలు హైదరాబాదు ను వదిలేసి వెళ్లిపొయినట్లుగా తెలుస్తొంది. సంక్రాంతికి ఓ హిట్ సినిమాను తీసిన యువ నిర్మాత గత రెండు రోజులుగా అందుబాటులో లేడని… మరికొందరు తమపై కూడా ఎక్కడ ఐటీ నజర్ పడుతుందోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప2 మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సారి రికార్డులతో కాదు… ఆ రికార్డుల వెనక మతలబు గురించి ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటూ దిల్ రాజు వస్తే… వచ్చినదెంతో తెలుసుకోవడానికి ఐటీ అధికారులు వచ్చేశారు.అవునూ ఇండస్ట్రీలో ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్‌లోని బ‌డా నిర్మాణ సంస్థ‌లపై ఐటీ దాడులు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రెండు అగ్ర నిర్మాణ సంస్థ‌లతో పాటు వాటితో వ్యాపార లావాదేవిలున్న కంపెనీలు, వ్యక్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇటీవల […]

షూటింగ్ కోసం ప్రకృతితో చెలగాటం,, టాక్సిక్ కోసం చెట్లను నరికేసిన మేకర్స్

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాంతార ప్రీక్వెల్.. కాంతార సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో అంతకు మించి అనేలా ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్… భారీ క్యాస్టింగ్ తో నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రజెంట్ కర్ణాటకలోని కుందాపూర్, గవిగుడ్డ అడవి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. కాంతారలో హీరో తండ్రి అడవుల్లో అర్థంతరంగా మాయమైపోతాడు. అదే పాయింట్ తో ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రకృతికీ నడుమ జరిగే పోరాటం కోసం అడవిప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అడవి బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లో భాగంగా అడవికి నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు

సినిమా అంటే లేనిదాన్ని సృష్టించడం మనకు తెలుసు. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారనే తెలుసు. కానీ అది కాస్త రివర్స్ అవుతోంది. ఉన్న ప్రపంచాన్ని లేకుండా చేస్తున్నారు కొందరు మేకర్స్ . సినిమాల కోసం ప్రృతితో చెలగాటం ఆడుతున్నారు. సినీ మేకర్స్ చేష్ట‌లు ఈ మ‌ధ్య హ‌ద్దులు దాటుతున్నాయి. సినిమాల కోసం కొంద‌రు మ‌రీ బ‌రితెగిస్తున్నారు. మామూలుగా సినిమాల్లో నిజ‌మైన జంతువుల‌ను చూపెట్ట‌డ‌మే నేరంగా చెప్తున్నాయి చ‌ట్టాలు. ప్ర‌కృతి, జీవ‌జ‌లానికి చేటుచేసే విధంగా ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌కూడ‌ద‌ని […]

చిరుతో అనీల్ కాంబోపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్!”

అనీల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందే ఈ సినిమా టాలీవుడ్‌లో మరో భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశముంది. చిరంజీవి త‌న కెరీర్‌లో మాస్ ఇమేజ్‌తో పాటు పాటల పట్ల ప్రాధాన్యత ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అనీల్ రావిపూడి చేసిన తాజా వ్యాఖ్యలు ఈ సినిమాపై ఆడియెన్స్ అంచనాలను మరింత పెంచాయి

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా 8 బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అనీల్, ఇప్పుడు మరో గర్వించదగిన ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఆయన, ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని చిత్రబృందంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అనీల్ రావిపూడి కాంబినేషన్ అనీల్ రావిపూడి త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అనీల్ ఈ […]

వెంకీ సినిమాకు వరల్డ్ వైడ్ సాలిడ్ రన్!”

సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూ, బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ చేస్తోంది. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే కాదు, సీనియర్ హీరోలందరిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 218 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా సీనియర్ హీరోలందరిలోనూ అత్యుత్తమ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పూర్తి మెచ్చిన సినిమా సాంకేతికంగా కూడా అదరగొట్టిన సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూ, బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ […]

“ధనుష్ మాటలు విని షాక్ అయ్యా ..!

ధనుష్ నటనకు, శేఖర్ కమ్ముల కథకు ఉన్న సత్తా చూసి "కుబేర" సినిమా పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త హరివిల్లు చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధనుష్, శేఖర్ కమూల సినిమా గురించి ముందే తెలుసుకుని ఆసక్తితో మాట్లాడటం శేఖర్‌ను ఆశ్చర్యపరిచింది. వైరల్ కామెంట్స్: ఈ ఆసక్తికర సంఘటన గురించి శేఖర్ కమ్ముల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సూపర్‌స్టార్ ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతూ అన్ని పరిశ్రమల్లో తన స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. హిట్స్, ఫ్లాప్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా ధనుష్ తన ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. ధనుష్ తన 50వ చిత్రంగా “రాయన్” ను స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సెల్వరాఘవన్, ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ములతో “కుబేర” సినిమా: పాన్ ఇండియా […]

“స్పిరిట్‌లో మెగా మ్యాజిక్ ,, ఫ్యాన్స్‌కు పూనకాలే!”

ఇటీవల "స్పిరిట్" సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.వరుణ్ తేజ్ తో చర్చలు జరుపుతున్నారని, ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడంపై సుముఖంగా ఉన్నారని టాక్. వరుణ్ పాత్ర కూడా హీరో పాత్రకు ధీటుగా ఉండనుందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఇటీవల “కల్కి 2898 ఎడీ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిష్టాత్మకమైన కథతో ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న […]

నందమూరి బాలకృష్ణ హెల్మెట్ ధరిస్తూ రోడ్ సేఫ్టీపై ప్రజలకి సందేశం

జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా హిందూపురం రవాణా అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రాణం పోతే మళ్లీ వస్తుందా? అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైకులు నడపాలి” అని తెలిపారు. అలాగే, కార్లు నడిపేవాళ్లు కూడా సీట్ బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “రోడ్డు […]

మాధవీలత ఫిర్యాదు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కోసం పోలీసుల వద్ద క్లిష్టం

టీఆర్ఎస్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గబ్బిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లిన ఆమె, జేసీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆవేదనకు గురై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు కారణంమాధవీలత మీడియాతో మాట్లాడుతూ, “జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలతో నేను చాలా ఆవేదనకు గురయ్యాను. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి, ఆ తరువాత క్షమాపణ చెబితే అది […]

క్రేజీ ఆఫర్లు పట్టేస్తున్న ముద్దుగుమ్మలు,, గ్లోబల్ రీచ్ లో పెరుగుతున్న ఫాలోయింగ్..!

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ వెబ్‌ సిరీస్‌ నటుడు టైరీస్‌ గిబ్సన్‌తో జోడీ కట్టినట్లు టాక్ నడుస్తోంది. చిత్రీకరణలో ఉన్న ఈ సిరీస్‌ సెట్స్‌ నుంచి కొన్ని ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌లోనే కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్‌ ప్రాజెక్టుతో ఎలాంటి మాయ చేస్తోందోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి సౌత్ నార్త్ బ్యూటీలు గోబల్ రీచ్ ను సంపాదించుకోవడంతో పాటు హాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంటూ దూకుడు చూపిస్తున్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు మనపెద్దలు. ఈఫార్ములాను ఒంటబట్టించుకున్నారు మనహీరోయిన్లు. ఇండియన్ బిగ్ స్క్రీన్ పై సత్తా చాటడం కాదు… గ్లోబల్ మార్కెట్ లోనూ మెరిసిపోతున్నారు. అక్కడ కూడా మన జెండా పాతేస్తున్నారు. ఇండియ‌న్ బ్యూటీలు లెవెల్ పెంచేస్తున్నారు. సౌత్, నార్త్ బార్డ‌ర్స్‌ను దాటేసి వ‌ర‌ల్డ్ సినిమాను దున్నేస్తున్నారు. అమ్మో హాలీవుడ్డా అనే రోజుల నుంచి.. అవునూ హాలీవుడ్లోనూ చేస్తున్నామ‌ని చెబుతున్నారు . ఒక‌రి వెంట మ‌రొక‌రు వ‌ర‌సగా ఇంటర్నేషనల్ మూవీస్‌లో రచ్చ చేస్తున్నారు. హీరోలకు కూడా […]