Auto Permits: విజయవాడ, విశాఖపట్నంలలో ట్రాఫిక్ చిక్కులు మరింత పెరుగనున్నాయి. ఇప్పటికే ఈ నగరాల్లో రోడ్లపై ఆటోలతో రద్దీ చుక్కలు చూపిస్తుంటే తాజాగా పర్మిట్లపై ఆంక్షల్ని ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నగరాల్లో ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ కోసం విధించిన ఆంక్షల్ని తొలగించారు.