పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల వేళ సెంటర్లకు వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. కేవలం హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది.