AP Sachivalayam: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది హేతుబద్దీకరణ ప్రక్రియ వేగంగా నడుస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో పని చేయాల్సిన సిబ్బందిని ఖరారు చేయడంతో మిగులు సిబ్బంది లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 15వేలకు పైగా సిబ్బంది మిగలనున్నారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది.