AP Liquor Shops: ఏపీలో గీత కులాలకు కేటాయించే మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. మొత్తం దుకాణాల్లో 10శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.