AP LAWCET Notification 2025 : ఏపీ లాసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులు చెల్లించాలి. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.