AP Fee Dues: కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల్ని విడతల వారీగా చెల్లిస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిల కోసం కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తుండటంపై మంత్రి స్పందించారు. కాలేజీ బకాయిల్లో రూ.788కోట్లు ఇచ్చామని మిగిలినవి కూడా చెల్లిస్తామన్నారు.