విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో దారుణం వెలుగు చూసింది. చిన్నారి నగ్న వీడియోలను సేకరించిన ఓ ప్రబుద్ధుడు… వాటిని అడ్డంపెట్టుకుని ఆ బాలిక తల్లిని శారీరకంగా లోబర్చుకున్నాడు. డబ్బులు కూడా లాగేశాడు. అతగాడి వేధింపులపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా.. పోక్సో కేసు నమోదైంది.