AP Caste Census: ఆంధ్రప్రదేశ్‌లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న క్రమంలో ఎస్సీ జనాభా వివరాలను సచివాలయాల వారీగా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. సచివాలయాల్లో జాబితాలు లేకపోవడం, జాబితాల్లో పేర్లు మాయమవడం వెలుగు చూసింది.