AP Building Rules: ఏపీలో భవన నిర్మాణ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా చేపట్టే అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు హైకోర్టు ఆదేశాలతో తాజా ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతులు సరళతరం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.